Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ దిష్టిబొమ్మ మంటలంటుకుని కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు!

ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మకు నిప్పుపెడుతుండగా జరిగిన ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి సాధిస్తోదంటూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విభాగం సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించింది. మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకని ఒక ఆయిల్ క్యాన్ తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక చోటుకి చేరారు. కార్యకర్తల చేతుల్లో ఉన్న దిష్టి బొమ్మపై ఆయిల్ పోసి నిప్పంటిస్తుండగా కార్యకర్తలకు అంటుకుంది. దీంతో ఎటుపడితే అటు వారు పరుగులు పెట్టారు. సుమారు ఐదుగురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సుఖీందర్ సింగ్ సుఖ్ తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. కాగా, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

More Telugu News